ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలను తెరవడాన్ని నిలిపివేసిన సౌదీ
- April 09, 2022
సౌదీ: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) నుండి కొత్త సూచనల ప్రకారం.. సౌదీ అరేబియాలోని అన్ని బ్యాంకులు క్లయింట్ల కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొత్త ఖాతాలను తెరవడాన్ని నిలిపివేయనున్నాయి. ఏప్రిల్ 10, ఆదివారం నుండి ఈ సూచనలు అమల్లోకి రానున్నాయి. బ్యాకింగ్ మోసాలను అరికట్టేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఖాతాలను తెరవడం అనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థల శాఖల ద్వారా మాత్రమే జరుగనుంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ కొత్త సూచనల ప్రకారం.. సౌదీయేతర క్లయింట్లు ఇకపై ఆన్లైన్లో నగదు బదిలీని చేయలేరు. దీనికి బదులుగా వారు వ్యక్తిగతంగా నగదు బదిలీ చేయాలి. ఆన్లైన్లో బదిలీ చేయగల మొత్తాన్ని SR60,000కి పరిమితం చేశారు. దేశీయంగా నగదు బదిలీకి రెండు గంటల సమయం పట్టనుండగా.. అంతర్జాతీయ నగదు బదిలీలకు 24 గంటల సమయం పట్టనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







