సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
- April 09, 2022
హైదరాబాద్: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య (94) ఈ రోజు ఉదయం కన్నుమూశారు.యూసఫ్ గూడలోని తన స్వగృహంలో బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు ఆయన విశేష సేవలందించారు.అందరివాడుగా, అతి సౌమ్యుడిగా పేరొందారు. ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నిటింకి దర్శకత్వమూ వహించారు. డైరెక్టర్ గా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు సినిమాలు తీశారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు.వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్‌గా నటించి మెప్పించారు. కెరీర్ మొదట్లో ఎం.బాలయ్య కొన్ని సినిమాల్లో హీరోగానూ యాక్ట్ చేశారు. ‘ఎత్తుకు పైఎత్తు’తోపాటు ‘భాగ్యదేవత’, ‘కుంకుమ రేఖ’ మూవీల్లో ఆయన కథానాయకుడిగా కనిపించారు. బాలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









