గుజరాత్‌లో కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదు

- April 09, 2022 , by Maagulf
గుజరాత్‌లో కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదు

గుజరాత్: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. మహమ్మారి కొత్త రూపాల్లో విరుచుకుపడుతోంది. తాజాగా ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్ఈ దేశంలోకి అడుగుపెట్టింది.గుజరాత్‌లో కొత్తరకం వేరియంట్ ఎక్స్ఈ కేసు నమోదయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.మిగిలిన కరోనా వేరియంట్ల కంటే ఎక్కువ వేగంగా (10 శాతం) విస్తరించే గుణం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు. మార్చి 13న వడోదర పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ ఉన్నట్టు గుర్తించగా, రోగి వారం రోజుల్లో కోలుకున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ గా తేలడంతో మరోసారి నిర్ధారించుకునేందుకు శాంపిల్ ను పంపించినట్టు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com