ఏలూరు పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం - మోడీ

- April 14, 2022 , by Maagulf
ఏలూరు పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం - మోడీ

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 గురు మృతి చెందగా..13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్​ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న బాధితుల్లో మరికొంతమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. ఈ ప్రమాదం ఫై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
 
‘‘ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్ లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’అంటూ ప్రధాని తరఫున ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే ఈ ఘటన పట్ల సీఎం జగన్ , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , లోకేష్ తదితరులు విచారణ వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రస్తుతానికి పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ‘కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా..?’ అనే అంశాలపై విచారణ చేపడుతున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com