అటువంటప్పుడు మాకూ అభిప్రాయాలు ఉంటాయి: జైశంకర్
- April 14, 2022
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య 2ప్లస్2 మంత్రుల సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఇరుదేశాల విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల మధ్య వాషింగ్టన్ లో సమావేశం జరగడం తెలిసిందే. భారత్ లో ఇటీవలి కొన్ని ఆందోళనకర పరిణామాలను అమెరికా పర్యవేక్షిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, జైళ్ల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనల ఘటనలను బ్లింకెన్ ప్రస్తావించారు. దీంతో బ్లింకెన్ వ్యాఖ్యలకు సంబంధించి జైశంకర్ కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.
తాజా సమావేశంలో మానవ హక్కులకు సంబంధించి చర్చ జరగలేదని జైశంకర్ స్పష్టత ఇచ్చారు. సైనిక, రాజకీయ పరమైన అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ఎప్పుడైనా ఈ అంశం చర్చకు వస్తే భారత్ మౌనంగా ఉండబోదన్నారు. ‘‘భారత్ గురించి అభిప్రాయాలను కలిగి ఉండే హక్కు ఇతరులకు ఉంది. అమెరికా సహా ఇతర ప్రాంతాల్లోని మానవ హక్కుల పరిస్థితిపైనా మాకు కూడా అభిప్రాయాలు ఉంటాయి’’అని జైశంకర్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!