యూఏఈలో 5 రోజులపాటు ఈద్ సెలవులు.. బాణసంచాతో జాగ్రత్త
- April 16, 2022
యూఏఈ: 5 రోజులపాటు ఈద్ సెలవులు ఉన్నందునా తల్లిదండ్రులు తమ పిల్లలను పటాకులతో ఆడనివ్వవద్దని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. యువకులు సాధారణంగా బాణసంచా కాల్చి ఈద్ అల్ ఫితర్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రమాదాలు, జాగ్రత్తలను తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. బాణసంచా వినియోగానికి సంబంధించి దేశంలోని చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే Dh100,000 వరకు జరిమానా విధిస్తామని గత సంవత్సరం అధికారులు ప్రకటించారు. గతంలో ఎవరైనా పటాకుల వ్యాపారం చేసినా, తయారు చేసినా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. బాణాసంచా పేలుడు పదార్థంగా పరిగణించబడుతున్నందున వాటిని ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







