డెలివరీ ఆర్డర్‌లపై నిబంధనలు పాటించాలి: మంత్రిత్వ శాఖ

- April 16, 2022 , by Maagulf
డెలివరీ ఆర్డర్‌లపై నిబంధనలు పాటించాలి: మంత్రిత్వ శాఖ

రియాద్: కస్టమర్‌లకు ఆర్డర్ డెలివరీపై రెస్టారెంట్‌లు, కేఫ్‌లు నిబంధనలను స్పష్టంగా,  పారదర్శకంగా పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్‌రహ్మాన్ అల్-హుస్సేన్ అన్నారు. డెలివరీ ఆర్డర్‌లపై కనీస పరిమితి ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలని సూచించారు. ఫుడ్ ఐటమ్స్ తప్పనిసరిగా నాలుగు ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ‘‘కనీస ఆర్డర్ విధానాలను స్పష్టంగా ప్రదర్శించాలిబడాలి. సదరు ఐటమ్ ని తప్పనిసరిగా మెనులో ఉండాలి. ఆహారాన్ని ఎలక్ట్రానిక్‌గా లేదా ఫోన్‌లో ఆర్డర్ చేసినప్పుడు ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి. ఆర్డర్ రద్దు విధానం కూడా స్పష్టంగా ఉండాలి.’’ అని అల్-హుస్సేన్ నిర్దేశించారు. కస్టమర్ల డెలివరీ ఆర్డర్‌లకు సంబంధించిన సేవలపై ఎలాంటి రుసుము విధించకూడదని అల్-హుస్సేన్ ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com