'ఎఫ్3' సెకండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా' ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్
- April 20, 2022
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'F3' థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాటని విడుదల చేయనుంది.
తాజాగా 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ..ఈ ప్రోమోలో జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తూ కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం మరో చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. ప్రోమో చివర్లో సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్ తో కనిపించడం పాటపై ఇంకా ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 22న పూర్తి పాటని చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత : శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సహా నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డివోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్
ఎడిటర్ : తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









