కువైట్‌లో 3 వేల మంది అరెస్టు

- April 04, 2016 , by Maagulf
కువైట్‌లో 3 వేల మంది అరెస్టు

 కువైట్‌లో వీసా గడువు ముగిసిన, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారం వ్యవధిలో దాదాపు మూడు వేల మంది కార్మికులను అరెస్టు చేశారని అక్కడి తెలుగువారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన కార్మికులు, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్ తదితర దేశాలకు చెందినవారు కువైట్‌కు వలస వెళుతుంటారు. కంపెనీ వీసాపై కువైట్‌కు వెళ్లినా యాజమాన్యం ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించకపోవడంతో పాస్‌పోర్టు, వీసాలను వదలి బయటకు వచ్చి దొరికిన పని చేసుకుంటున్నారు.వీసా, వర్క్ పర్మిట్ లేకుండా వేలాది మంది విదేశీయులు పనులు చేస్తున్నారన్న కారణంతో కువైట్ ప్రభుత్వం ఇటీవల ఏరివేత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు నెలల నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తమదేశంలో ఉంటున్నారని దాదాపు 45 వేల మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. వారం నుంచి తనిఖీల తీవ్రత పెంచారు. ఈ విషయాన్ని మోర్తాడ్ మం డలం ఏర్గట్లకు చెందిన ఆనందం గంగేశ్వర్ 'సాక్షి'కి ఫోన్‌లో వివరించారు. ఆయన కువైట్ బల్దియాలో పని చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది కువైట్‌లో కల్లివెల్లి అయ్యారని పేర్కొన్నారు. అరెస్టు అయినవారిలో కొంత మంది జరిమానా చెల్లించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కొంత మంది జైళ్లో ఉన్నారని ఇటీవల కువైట్ నుంచి ఇంటికి వచ్చిన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ వాసి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మన కార్మికులను ఇళ్లకు చేర్పించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com