కువైట్లో 3 వేల మంది అరెస్టు
- April 04, 2016
కువైట్లో వీసా గడువు ముగిసిన, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారం వ్యవధిలో దాదాపు మూడు వేల మంది కార్మికులను అరెస్టు చేశారని అక్కడి తెలుగువారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన కార్మికులు, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్ తదితర దేశాలకు చెందినవారు కువైట్కు వలస వెళుతుంటారు. కంపెనీ వీసాపై కువైట్కు వెళ్లినా యాజమాన్యం ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించకపోవడంతో పాస్పోర్టు, వీసాలను వదలి బయటకు వచ్చి దొరికిన పని చేసుకుంటున్నారు.వీసా, వర్క్ పర్మిట్ లేకుండా వేలాది మంది విదేశీయులు పనులు చేస్తున్నారన్న కారణంతో కువైట్ ప్రభుత్వం ఇటీవల ఏరివేత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు నెలల నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తమదేశంలో ఉంటున్నారని దాదాపు 45 వేల మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. వారం నుంచి తనిఖీల తీవ్రత పెంచారు. ఈ విషయాన్ని మోర్తాడ్ మం డలం ఏర్గట్లకు చెందిన ఆనందం గంగేశ్వర్ 'సాక్షి'కి ఫోన్లో వివరించారు. ఆయన కువైట్ బల్దియాలో పని చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది కువైట్లో కల్లివెల్లి అయ్యారని పేర్కొన్నారు. అరెస్టు అయినవారిలో కొంత మంది జరిమానా చెల్లించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కొంత మంది జైళ్లో ఉన్నారని ఇటీవల కువైట్ నుంచి ఇంటికి వచ్చిన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ వాసి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మన కార్మికులను ఇళ్లకు చేర్పించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







