రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ..
- April 05, 2016
అంచనాలకనుగుణంగానే ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మొదటి త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో రేపోరేటు 25 బేసిస్ పాయింట్లు, రివర్స్ రేపోరేటు 6.57 శాతం నుంచి 6.50 పాయింట్లకు తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధులు) 4 శాతాన్ని యథాతథంగా ఉంచింది. రెపోరేటు 0.25 శాతం కోతతో గృహ, వాహన రుణాలు మరోసారి తగ్గడానికి మార్గం సుగమమైంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







