అభిమానులు సంతోషంతో సినిమా చూడాలే కాని డబ్బులు వెచ్చించి కాదు : పవన్
- April 05, 2016
తెలుగు తెరపై పవన్ కళ్యాన్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువిరస్తుంది..దానికి కారణం పవన్ కళ్యాన్ తన మార్క్ మరోసారి నిరూపించుకున్నందుకే.. అదేనండీ ఈ మద్య పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లో కొంత మందికి..బయట కొంత మందికి సంబరాలు..ఈజీ మనీ కోసం వెంపర్లాడటం జరుగుతుంది. అభిమానులు ఎంతో ఆశతో థియేటర్ల వద్దకు రాగా అప్పటికే టిక్కెట్లు క్లోజ్ అయినట్లు బోర్డు పెట్టడం..బ్లాక్ లో దందాలు నడపడం. గత సంవత్సరం విడుదలైన బాహుబలి చిత్రంతో ఇది మరీ విపరీతమైంది. 150 ఉండాల్సిన టిక్కెట్ 5000 వరకు అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు. అంటే ఈ లెక్కన సినిమా రిలీజ్ రోజు లక్షల్లో వెనుకేసుకున్నట్లే లెక్క..దీనిపై చిత్ర యూనిట్..ఫిల్మ్ వర్గాలు పెదవి విప్పలేదు.సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఓ దృశ్యంఅభిమానులు ఇష్టపూర్వకంగా కొంటే తమ తప్పేమిటీ అని ఎదురు ప్రశ్న వేశారు..కానీ ఇప్పుడు అలా కాదట..'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం విషయంలో ఇలాంటి బ్లాక్ దందా నడిపితే బాగుండదని అభిమానులు సంతోషంతో సినిమా చూడాలే కాని డబ్బులు వెచ్చించి మూడు గంటలు ఆనందం పొంది తర్వాత బాధపడే సంఘటనలు అస్సలు జరగొద్దని హెచ్చిరిస్తున్నారు పవన్ కళ్యాన్. ఈమేరకు థియేటర్ల యాజమాన్యానికి కూడా టిక్కెట్లు సక్రమమైన మార్గంలోనే అమ్మాలని అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవద్దని ఇలాంటి విషయాలు తన వద్దకు వస్తే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారట.సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్, బ్రహ్మానందంఅంతే కాదు తన చిత్ర యూనిట్ ని కూడా ఓ కన్నువేసి ఉంచమని చెప్పారట. మరోవైపు సర్ధార్ చిత్రం కోసం బ్లాక్ దందా అప్పుడే మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి..కర్నూల్ లో ఓ అభిమాని ఏకంగా పది లక్షలు వెచ్చించి టిక్కెట్లు కొన్నట్లు వార్తలు వచ్చాయి. మరి దీనిపై పవన్ ఏ రకంగా స్పందిస్తాడో సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ రోజు టిక్కెట్ల దందా ఏరకంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాదు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







