గ్రేట్ ప్లేస్ టు వర్క్‌గా గుర్తించబడిన మెడికవర్ హాస్పిటల్స్
- April 25, 2022
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ మల్టీ చైన్ హాస్పిటల్ లో ఒకటైన మెడికవర్ హాస్పిటల్‌ను గ్రేట్ ప్లేస్ టు వర్క్ గా గుర్తించారు.ఓ అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికేషన్ ఇవ్వడమనేది మహోన్నతమైన పని సంస్కృతి, విలువలు, సంస్థ లోపల అభివృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణంకు దర్పణంగా నిలుస్తుంది.

ఈ సర్టిఫికేషన్ అందుకోవడం గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ మహోన్నతమైన సర్టిఫికేషన్ సాధించడం ఓ గౌరవంగా భావిస్తున్నాము.ఉద్యోగులకు మేము ఇస్తోన్న విలువ, పనితీరు, వృద్ధి, ప్రోత్సాహం తీర్చిదిద్దిన పనిసంస్కృతి పట్ల మా నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. మరింత ఆత్మవిశ్వాసం, బలం, ధృడవిశ్వాసంతో లక్ష్యం వైపు పయనించడానికి మనమంతా కలిసికట్టుగా ఉన్నామని ఇది ఋజువు చేస్తుంది. మరింతగా మనం సాధిద్దాం’’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలు, ప్రాంతాలలో అత్యున్నత గుర్తింపు పొందినది గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్.ఈ సర్టిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కంపెనీలను అత్యంత కఠినమైన ప్రమాణాలకనుగుణంగా సమీక్షిస్తారు.ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ ట్రస్ట్ ఇండెక్స్ సర్వే మరియు కల్చర్ ఆడిట్‌ను సైతం నిర్వహిస్తారు.ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్ ఈ సర్టిఫికేషన్ పొందడమన్నది సంస్థ లోపల నమ్మకం, స్నేహశీలత, గౌరవం పెంపొందించడంలో సంస్ధ చేస్తోన్న కృషికి నిదర్శనంగా నిలుస్తుంది.

మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ ‘‘మా ఉద్యోగుల శ్రమ,మా విజయానికి పునాదిగా నిలిచింది.మా చుట్టూ ఉన్న సమాజంపై అర్ధవంతమైన ప్రభావం చూపడంలో ఇది ఎంతగానో సహాయపడింది.ఓ సంస్ధగా మా ఉద్యోగులకు అభ్యసించేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశాలను అందిస్తున్నాము.అలాగే మా రోగులకు ఏది మంచో అదే చేస్తున్నాము.ఇవే అంశాలు మెడికవర్ ఈ సర్టిఫికేషన్ పొందడంలో తోడ్పడ్డాయి’’ అని అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







