గుజరాత్లో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
- April 25, 2022
గుజరాత్:భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో..పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను పట్టుకుంది . భారత్ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.
రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్‌లో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థానీ బోట్ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







