దిల్ రాజు నిర్మాతగా బిగ్ బాస్ విన్నర్ సన్నీ వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'
- April 25, 2022
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ "ఏటీఎమ్". జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ "ఏటీఎమ్" వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా...పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







