పుట్టిన రోజు
- April 30, 2022
రాత్రి కిచెన్ మరియు మిగతా పని అంత చేసుకుని మా వారికోసం వెయిట్ చేస్తున్నా. ఆఫీస్ పని తో బిజీ గా ఉండటం తో రావటం లేట్ అవుతుంది.
తెల్ల వారితే శనివారం చిన్న..అదేనండి మా అబ్బాయి చరణ్ తన పుట్టినరోజు అని చాలా ఎక్ససైటెడ్ గా ఉన్నాడు. చరణ్ కి ఐదు నిండి ఆరు సంవత్సరాలు వస్తాయి.
చరణ్ తనకి ఏమి కావాలో అన్న దానికంటే, తన ఫ్రెండ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని పదకొండు సంవత్సరాల అక్క చరిత తో డిస్కషన్స్ అండ్ అర్గుమెంట్స్ చేస్తున్నాడు.
రాత్రి లేట్ అవుతోంది పిల్లల రూమ్ లో నుండి ఇంకా మాటలు వినపడుతుండడం తో రూమ్ లోకి వెళ్లి చుస్తే, గొడవ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని అర్ధం అయ్యింది.
నన్ను చూడగానే మొదలు పెట్టాడు చరణ్ " మమ్మీ అక్క చూడు ఎప్పుడు బుక్స్ ఇమ్మంటుంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం. నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు నా గిఫ్ట్స్ బోరింగ్ అని. అందుకే ఈ సారి టాయ్ కార్స ఇస్తా అని ప్రామిస్ చేశా వాళ్ళకి". వెంటనే చరిత అందుకుంది, "ఆ కార్స్ అన్ని వేస్ట్ చక్కగా బుక్స్ అయితే నాలెడ్జి వస్తుంది అండ్ వాళ్ళకి ఎప్పుడు గుర్తు ఉంటుంది నువ్వు ఇచ్చ్చావని అని".
వాళ్ళ ఇద్దరినీ ఒక అగ్రిమెంట్ కి తీసుకుంటారావటానికి చాలా టైం పట్టింది నాకు.
చివరకి బుక్స్ చరిత బర్త్డే కోసం అండ్ టాయ్ కార్స్ చరణ్ బర్త్డే కోసం అని ఒప్పుకున్నారు ఇద్దరు.
పడుకోపెట్టటానికి చరణ్ పక్కన పడకున్నాను. కాసేపు అయ్యాక అడిగాడు "మమ్మీ నేను నా బర్త్డే కి వేరే వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వక పోయినా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనా" అని.
"ఎందుకు ఇవ్వకూడదు అన్నా"నేను .
" ఎవరికి ఇద్దామనుకుంటున్నావు" అని ఆడిగా
"అదే మమ్మీ ఆంటీ కి" అన్నాడు.
ఈ మధ్య చరణ్ రెండు మూడు సార్లు ఆంటీ గురించి అన్నట్లు గుర్తు వచ్చింది. మొదటి సారి వాడిని చలిగా ఉంది స్వేటర్ వేసుకోమన్నప్పుడు, ఆంటీ కి లేదు కదా పాపం స్వేటర్ అన్నాడు. రెండో సారి పెద్ద గాలి వాన పడుతున్నప్పుడు, ఆంటీ కి ఎలా ఉందొ పాపం నీళ్ళ్లు వచ్చేశాయేమో అన్నాడు.
"ఎందుకు ఇవ్వ కూడదు చక్కగా ఇవ్వచ్చు" అని చెప్పా. వెంటనే లేచి కూర్చుని "అయితే పెద్ద వాళ్ళకి నేను సర్ప్రైస్ చెయ్యోచ్చా" అని అడిగాడు.
"ఎందుకు చెయ్య కూడదు" అన్న.
"అయితే రేపు ఎలాగూ నా బర్త్డే కదా ఆంటీ ని సర్ప్రైజ్ చేస్తా" అని చాలా ఉత్సాహంగా చెప్పాడు. నేను సరే అని అనడంతో హ్యాపీ గా నిద్రపోయాడు.
తెల్ల వారడం తోనే హారతి ఇవ్వటం, డాడీ కొన్న కొత్త సైకిల్స్ తో చాలా హ్యాపీ గా ఉన్నారు ఇద్దరు.పార్టీ కోసం ముగ్గురు కలిసి ఆరెంజ్ చేస్తున్నారు. నేను కిచెన్ లో పార్టీ కోసం స్పెషల్స్ చేస్తున్నా.
ఇంతలో చరణ్ వఛ్చి "మమ్మీ ఇప్పుడే వెళ్లి ఆంటీ ని సర్ప్రైజ్ చేద్దాం" అన్నాడు. ఒక గిఫ్ట్ బాక్స్ లో ఇంట్లో చేసిన ఐటమ్స్ అన్ని చక్కగా ప్యాక్ చేయించాడు నాతో మరియు వాళ్ళ డాడీ తో ఒక మంచి కవర్ తెచ్చి దాంట్లో నీట్ గా వాడికి ఇష్టమైన క్యాడ్బరీ సిల్క్ చాక్లెట్ మరియు తన దగ్గర ఉన్న అమ్మమ్మ ఇచ్చిన shawl నీట్ గా ప్యాక్ చేసాడు. నలుగురం స్టార్ట్ అయ్యాము. వాడి స్కూల్ దారిలో రోడ్ చివర టార్పాలిన్ తో చేసిన ఒక చిన్న టెంట్ దగ్గర ఆపించి మేము వచ్చ్చేలోపు ఆ టెంట్ దగ్గర బాగ్ పెట్టేసి వచ్చ్చేసాడు. గబగబా కార్ లో కూర్చుంటూ మమ్మల్ని కూడ తొందర చేసాడు కార్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్లిపొమ్మని.
ఎందుకు అంత కంగారు పడతావు అని అడిగాము.
" ఆంటీ కి నేను శాంతాక్లాస్ లాగ" అని అనేసరికి మా ఇద్దరికీ నోటా మాట రాలేదు.
మేము కార్ రివర్స్ చేసుకుని వెనక్కి వస్తుంటే ఆ టెంట్ లో నుండి చాలా పెద్ద ఆవిడ నడవ లేక నడుస్తూ వచ్చి ఆ బాగ్ తీసుకుని చూస్తోంది ఏముంది అని.
చరణ్ చాలా హ్యాపీ గా "మమ్మీ ఆంటీ తీసుకుంది. శాంతాక్లాస్ అనుకుంటుంది కదా మమ్మీ నన్ను" అని చాలా సంతోషం గా మాట్లాడుతున్నాడు వాళ్ళ అక్కతో.
ఇంటికి వెళ్ళాక వాళ్ల ఫ్రెండ్స్ రావటం తో బిజీ అయ్యిపోయారు ఆయన మరియు పిల్లలు. చిన్న పిల్లలు ఎంత కల్మషం లేని మనుషులు? అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు.
మనం వాళ్ళకి ఉండే ఆ మంచి మనస్సుని అలాగే ఉండేటట్టు చెయ్యగలిగితే తల్లి తండ్రులు గా మంచి మనుషులని ఈ ప్రపంచానికి ఇచ్చినట్టే అనుకుంటూ పిల్లలు గేమ్స్ ఆడుతూ అరుపులు విని తినడానికి ఇవ్వటానికి అటుగా వెళ్ళాను.
--ఉమాదేవి వాడ్రేవు
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి