కాబూల్ మసీదులో పేలుడు.. 66 మంది మృతి
- April 30, 2022
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. ఓ మసీదులో జరిగిన శక్తిమంతమైన పేలుడులో 66 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మసీదు కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారిగా రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సున్నీ ముస్లింలే లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. కాగా, పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అభద్రత మధ్య నిత్యం హింసకు గురవుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







