భారత్ కరోనా అప్డేట్
- May 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ప్రస్తుతం 19వేల 500 యాక్టివ్ కేసులుండగా.. వాటిని 0.05 శాతంగా తేల్చారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కేసులు నమోదు కాగా, వాటిలో 5లక్షల 23వేల 869 మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజులో 2723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావం నుంచి మొత్తంగా 4కోట్ల 25లక్షల 38 వేల 976 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
472 రోజులుగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 189.23 కోట్ల డోసులను అందజేశారు. ఆదివారం ఒక్కరోజు 4లక్షల 2వేల 170 డోసుల టీకాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 189కోట్ల 23లక్షల 98వేల 347 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







