ఉగాదికి 'బాబు బంగారం'చిత్రం' ఫస్ట్ లుక్...
- April 05, 2016
వెంకటేష్, నయనతార నాయకా నాయికలుగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్ సంయుక్తంగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్, నయనతార మూడవ సారి జోడీ కడుతున్న చిత్రమిది. గతంలో 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో కలిసి నటించారు. ఆ చిత్రాలు ఘన విజయం సాధించినట్లుగానే ఈ సినిమా కూడా అదే తరహాలో పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఫస్ట్‌లుక్‌ని ఉగాది పర్వదిన శుభ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మారుతి సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







