సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో
- April 06, 2016
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించనున్నాడు. ఊపిరి సినిమాతో నాగార్జున, కార్తీలు కలిసి నటించగా మరోసారి అదే ఫార్ములాతో భారీ వసూళ్లను టార్గెట్ చేస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో బైలింగ్యువల్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ, కత్తి లాంటి సినిమాల్లో నటించిన విజయ్, ఈ ప్రపోజల్ ను కాదనడన్ననమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.అంతేకాదు తెలుగు మార్కెట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయ్, మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తే అది తనకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మహేష్ కూడా తమిళ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే విజయ్ లాంటి స్టార్ హీరో సాయం అవసరమనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను, మే లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే భారీ మల్టీ స్టారర్ తెర మీదకు వస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







