'మేకిన్ ఇండియా'తో పేదలకు ఒరిగేదేం లేదు: రాహుల్ గాంధీ
- April 06, 2016
బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బంగారు వర్తకుల పాలిట ఆత్మహత్యాసదృశ్యంగా ఆయన వర్ణించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బంగారు వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. బీజేపీలోని కొంత మంది నాయకులు బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని వ్యతిరేకిస్తున్నారని, బహిరంగంగా చెప్పడానికి వారు జంకుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.'మేకిన్ ఇండియా'లోగోలో సింహం బొమ్మ పెట్టడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లను మేలు చేసేందుకే 'మేకిన్ ఇండియా'ను ముందుకు తీసుకొచ్చారని తర్వాత తనకు అర్థమైందన్నారు.మేకిన్ ఇండియా'తో పేదలకు ఒరిగేదేం లేదని అన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







