నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం : అమెరికా
- April 06, 2016
అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో 10 మంది ప్రవాస భారతీయులు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉండటం గమనార్హం. వారిని తేజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టిగా గుర్తించారు.అసలేం జరిగిందంటే... ఉత్తర న్యూజెర్సీ యూనివర్శిటీ భోగస్‌దని... దానిలో ఎలాంటి తరగతులు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే దీని పేరుతో వెయ్యి మందికి పైగా విదేశీయులు వీసాలు పొంది అమెరికాకు వచ్చినట్లు తేలింది.ముఖ్యంగా భారత్, చైనాల నుంచే వీరు వలసేతర విద్యార్థి వీసాలతో వచ్చినట్లు బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఏకంగా పది మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లో ఉంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు







