సర్కారు వారి పాట: 'ప్లస్’ లు ఏంటీ.? 'మైనస్' లు ఏంటీ.?
- May 10, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ’సర్కారు వారి పాట‘ సినిమా రిలీజ్‌కి రెడీగా వున్న సంగతి తెలిసిందే. మే 12న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు హోరెత్తిపోతున్నాయ్. ఓ పక్క సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, ఆయన ముద్దుల తనయ సితార కూడా ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, దాదాపు 130 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. ప్రోమోల పరంగా ప్రీ రిలీజ్ బజ్ చాలా చాలా పాజిటివ్‌గా వుంది. ‘కళావతి’ సాంగ్ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎట్రాక్ట్ అవుతున్నారీ సాంగ్‌కి.
‘పెన్నీ సాంగ్’ తీసుకుంటే, క్యూట్ క్యూట్‌గా పిల్లల్ని ఎట్రాక్ట్ చేసింది ఈ సాంగ్. అలాగే, యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయ్. అన్ని వర్గాల ఆడియన్స్‌నీ రిలీజ్‌కి ముందే ఇంతలా ఎట్రాక్ట్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో వచ్చింది లేదు.
అయినా కానీ, ఆడియన్స్ ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయ్. ‘పుష్ప’, కేజీఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఇలా పెద్ద సినిమాలు ఈ మధ్య చాలానే రిలీజయ్యాయ్. దాంతో పాటే ఇటీవల వచ్చిన ‘ఆచార్య’ కూడా. కానీ, పై సినిమాలతో పోల్చితే, ‘ఆచార్య’ రిజల్ట్ ఏమంత బాగా లేదు.
సో, ఆయా సినిమాలతో ‘సర్కారు వారి పాట’కు ఖచ్చితంగా పోలిక వుంటుందనడంలో సందేహం లేదు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మరి, ఆ మైనస్‌ని అధిగమించి ‘సర్కారు వారి పాట’ అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







