అసని ఎఫెక్ట్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 37 రైళ్లు రద్దు..

- May 11, 2022 , by Maagulf
అసని ఎఫెక్ట్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 37 రైళ్లు రద్దు..

అసని తూఫాన్ ఎఫెక్ట్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 37 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను మచిలీపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ తుఫాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు చేయగా… విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు, విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసింది రైల్వే శాఖ. మరి కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసింది రైల్వేశాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com