హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: అవమానాల్ని జయించిన నైట్రో స్టార్
- May 11, 2022
‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు సుధీర్ బాబు. కృష్ణ అల్లుడు అనే బ్యాక్ గ్రౌండ్‌తోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తనంతట తానుగా సినిమా సినిమాకీ, తన టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు సుధీర్ బాబు.
తొలి సినిమాకి చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అసలు హీరోగా పనికి రావన్నారు. గొంతు కూడా బాగా లేదన్నారు. అయినా తన సంకల్పం వదులుకోలేదు. కష్టపడ్డాడు. ఊహించని విధంగా మేకోవర్ సాధించాడు. హీరోగా తనదో డిఫరెంట్ స్టైల్ అని నిరూపించుకున్నాడు.
అలాగే, సుధీర్ బాబు కేవలం హీరో మాత్రమే కాదు, మంచి నటుడు అని చెప్పడం కరెక్ట్‌గా వుంటుందేమో. ఎందుకంటే, కేవలం హీరో పాత్రలే కాదు, నెగిటివ్ రోల్స్‌లోనూ సుధీర్ బాబు మెప్పించగలడు అని నిరూపించుకున్నాడు బాలీవుడ్ మూవీ ‘బాఘీ’ చిత్రంతో.
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం సుధీర్ బాబు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి ఈ సినిమాలో సుధీర్ బాబుతో జత కడుతోంది.
కాగా, సుధీర్ బాబు మరో లేటెస్టు మూవీ ‘మామా మశ్చింద్ర’. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో సుధీర్ బాబును ‘నైట్రో స్టార్’ అని ప్రస్థావించడం విశేషంగా కనిపిస్తోంది.
ఎన్నో రకాల అవమానాల్ని తట్టుకుని నటుడిగా నిలదొక్కుకున్న నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నోసక్సెస్‌ఫుల్‌గా జరుపుకోవాలని, కెరీర్‌లో మరెన్నో మంచి సినిమాలు చేయాలని ఆశిస్తూ మనం కూడా బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు యు నైట్రో స్టార్ సుధీర్ బాబు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







