పబ్లిసిటీ స్టంట్లేనా.? హిట్టు కొట్టేదేమన్నా వుందా విష్ణు.?
- May 11, 2022
మంచు వారబ్బాయ్ మంచు విష్ణు వర్ధన్ రెడ్డి చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యనే ఓ సినిమాని పట్టాలెక్కించాడు. ‘గాలి నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు మంచు విష్ణు. ఫుల్ టైమ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఓ వైపు షూటింగ్ పనులు జరుగుతుండగానే, మరోవైపు పబ్లిసిటీ స్టంట్లు కూడా మొదలెట్టేశాడు మంచు విష్ణు.
ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. అయితే, ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతోనూ మంచు విష్ణు చేస్తున్న హంగామా మూవులుగా లేదండోయ్.
సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లతో హోరెత్తించేస్తున్నాడు మంచు విష్ణు. మొన్నా మధ్య సన్నీలియోన్‌తో కలిసి తన ఇంట్లో ఆలూ పరాటాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అలాగే, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తోనూ పిచ్చ పిచ్చగా వేషాలు వేస్తూ ఆయా వీడియోలు నెట్టింట వైరల్ చేస్తున్నాడు.
పబ్లిసిటీ స్టంట్స్‌లో భాగంగా ఈ వీడియోలు అయితే, బాగానే వైరల్ అవుతున్నాయనుకోండి. కానీ, సినిమా సంగతేంటీ.? ఈ పబ్లిసిటీ స్టంట్లు సినిమా సక్సెస్‌కి ఎంత మేర ఉపయోగపడతాయి.? సన్నీలియోన్‌కి ప్రస్తుతం ఏమంత క్రేజ్ లేదనే చెప్పాలి. అలాగే హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌కీ అంత సీనూ, సినిమా లేదు. ఇక విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనే అక్కర్లేదు.
ఇలాంటి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా హిట్ సంగతెలా వుండబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







