మళ్లీ తెరపైకి వచ్చిన నయన్ పెళ్లి: ఈ ముచ్చటకొచ్చే క్రేజ్ వేరే లెవల్.!
- May 18, 2022
సౌత్ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న నయనతార సినిమాల ద్వారా దక్కించుకున్న పాపులారిటీతో పాటు, ప్రేమ, పెళ్లి ముచ్చట్లతో వచ్చే క్రేజ్ వేరే లెవల్ అనాలేమో. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు ప్రేమలో పడింది నయనతార.
దాదాపు పెళ్లి పీటల వరకూ చేరిన నయన్ పెళ్లి పెటాకులవ్వడంతో చివరిగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌షిప్ సాగిస్తోంది. ఇదిగో పెళ్లి.. అదిగో పెళ్లి.. అంటూ ఎప్పటికప్పుడే నయన్ పెళ్లి ముచ్చట హాట్ టాపిక్ అవుతుంటుంది ఎప్పటికప్పుడే.
మొన్నీ మధ్యనే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది ఈ జంట. అంతేకాదు, ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసేసుకున్నారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయ్. అవి ఎప్పుడూ వుండేవే అనుకోండి. అయితే తాజాగా ఇంకోసారి నయన్ పెళ్లి వార్త హాట్ హాట్‌గా చక్కర్లు కొట్టేస్తోంది.
ఈ సారి తిరుమల తిరుపతి నయన్ పెళ్లికి వేదిక కానుందట. ఆల్రెడీ ముహూర్తం కూడా సెట్ అయిపోయిందట. తిరుపతిలో నయన్ పెళ్లి వచ్చే నెల 9 వ తేదీన జరగనుందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. అంతా బాగానే వుంది.. ఈ సారైనా నయన్ పెళ్లి జరిగేనా.?
మొన్నీ మధ్య ఓ సిద్ధాంతి గారు నయన్‌కి పెళ్లి సూట్ కాదు.. సహజీవనమే సెట్ అవుతుందని జోస్యం చెప్పేశాడు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వెంటనే విడాకులు తప్పవని నయన్ భవిష్యత్ కూడా చెప్పేశాడా పెద్ద మనిషి. ఈ పరిస్థితుల్లో నయన్ ఏం చేస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!







