ఎన్నారై బ్యూటీతో బాలయ్య ‘స్పెషల్’ ఆటా పాటా.!
- May 18, 2022
బాలయ్య తాజా చిత్రం కోసం ఓ ఎన్నారై మోడల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తోంది.
కాగా, ఈ సినిమాలో బాలయ్య మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా అధ్దిరిపోయే ఓ ఐటెం సాంగ్ వుందట. ఆ సాంగ్ కోసం మొదట ‘ఖిలేడీ’ డింపుల్ హయాతీని ఎంగేజ్ చేశారట. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, లాస్ట్ మినిట్‌లో డింపుల్ హ్యాండిచ్చేసింది. అప్పుడు లైన్‌లోకి వచ్చింది ఈ ఎన్నారై బ్యూటీ.
ఇంతకీ ఎవరీ ఎన్నారై బ్యూటీ.? పేరు చంద్రిక రవి. పాప వెరీ హాట్. అమెరికాలో మోడలింగ్ రంగంలో పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ హీరోయిన్‌గా కాకపోయినా కొన్ని పెత్తనాలు చక్కబెట్టేసిందనుకోండి. ఇదిగో బాలయ్య బాబు పుణ్యమా అని టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చేస్తోందిప్పుడు.
ఇక బాలయ్యతో ఐటెం సాంగ్ అంటే ఎలా వుంటుంది ఊహించుకోండి. అలాగే వుంటది మరి. పాట క్లిక్ అయ్యిందా అంతే సంగతి. చంద్రిక పాప టాలీవుడ్‌లో పాతుకుపోవడం ఖాయం. అంతేనా.. ర్యాపో సెట్టయ్యిందా.. బాలయ్య ఒక్క ఛాన్సుతో విడిచి పెట్టేదేలే.. గతంలో సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైశ్వాల్ తదితర ముద్దుగుమ్మలకు బ్రేక్ ఇచ్చిన హిస్టరీ బాలయ్య లిస్టులో వుందిగా మరి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







