టాప్ మోడల్ బెంజ్ కారు కొన్న విశ్వక్ సేన్
- May 18, 2022
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒక్కో సినిమాతో నెక్ట్స్ లెవల్‌కి వెళుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అశోక వనంలో అర్జున కళ్యాణం" .
ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మే 6 న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి రిఫ్రెషింగ్‌గా ఉన్నాయని.. ముఖ్యంగా పెళ్లి విషయంలో హీరో చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయని నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పటి వరకు గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్ని మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపించారు. మొదటి రోజు మొదటి ఆటకే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో నిలబడలేకపోయిందని అంటున్నారు. దీనికి కారణం పెద్ద సినిమాలని అంటున్నారు.
సర్కారువారి పాట వంటి సినిమాలు రావడంతో థియేటర్స్ అన్ని అటే వెళ్లిపోయాయని, దీంతో సినిమాలో కంటెంట్ బాగున్నా.. ఎక్కువ రోజులు థియేటర్లో నిలవలేకపోయింది అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎన్నో వివాదాలు అతన్ని వెంటాడిన చాలా ధైర్యంగా నిలిచాడు. సినిమా సక్సెస్ కావడంతో మనోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజాగా అత్యంత ఖరీదైన కారును కొని తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఇంతకు ముందే విశ్వక్ సేన్ రేంజ్ రోవర్ కారును కొనేశాడు. అయితే ఇప్పుడు బెంజ్ కారుని కొనేశాడు. బెంజ్ కారులో టాప్ అండ్ లేటెస్ట్ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 మోడల్‌ను కొనేశాడు. దీని ధర మామూలుగా లేదు. కనిష్టంగా 2. 5 కోట్ల నుంచి గరిష్టం మూడు కోట్ల వరకు ఉంది.
విశ్వక్ సేన్ పోస్ట్‌పై దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే కౌంటర్ వేశాడు. అది నాదే.. ఫోటోలు దిగుతానంటే ఇచ్చిన అని కౌంటర్ వేశాడు. అలీ రెజా అయితే కంగ్రాట్స్ అని కామెంట్ పెట్టేశాడు. ఇక విశ్వక్ ఫ్యాన్స్ అయితే పార్టీ ఏది అన్నా అని కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







