ఏపీ ప్రజలకు ఊరట.. రాష్ట్రంలో కరెంట్ కోతలు పూర్తిగా ఎత్తివేత
- May 18, 2022
విజయవాడ: ఒకవైపు మాడు పగలగొట్టే ఎండలు.. ఇంటి పట్టున ఉందామంటే కరెంట్ కోతలు. దీంతో ఏపీ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.
ఈ ఎండాకాలం ముగిసే వరకు ఈ వెతలు తప్పవేమో అని ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పరిశ్రమలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయబోతున్నట్లు తెలిపింది.
ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. బొగ్గు సమస్యతో ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించింది ప్రభుత్వం. వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించింది. అయితే ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలీ డే కూడా ఎత్తివేసింది.
ఇకపై అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







