భారత్‌లో తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్
- May 20, 2022
న్యూ ఢిల్లీ: దేశీయంగా అభివృధ్ది చేసిన 5G టెక్నాలజీతో మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ విజయవంతంగా పరీక్షించామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
కాల్ అనంతరం “ఆత్మనిర్భర్ 5జీ.. ఐఐటీ మద్రాస్ లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించామని.. ఈ నెట్ వర్క్ పూర్తిగా భారతదేశంలోనే అభివృధ్ది చేశారని” ఆయన నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్ధ్యం సాధించాలన్న ప్రధాని మోదీ కోరిక దీనితో తీరినట్లు ఆయన పేర్కోన్నారు.
5జీ టెక్నాలజీ సొల్యూషన్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్ ను ఐఐటీ మద్రాస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







