భారత్‌లో తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్

- May 20, 2022 , by Maagulf
భారత్‌లో తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్

న్యూ ఢిల్లీ: దేశీయంగా అభివృధ్ది చేసిన 5G టెక్నాలజీతో మద్రాస్ ఐఐటీ‌లో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్‌వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ విజయవంతంగా పరీక్షించామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.

కాల్ అనంతరం “ఆత్మనిర్భర్ 5జీ.. ఐఐటీ మద్రాస్ లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించామని.. ఈ నెట్ వర్క్ పూర్తిగా భారతదేశంలోనే అభివృధ్ది చేశారని” ఆయన నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్ధ్యం సాధించాలన్న ప్రధాని మోదీ కోరిక దీనితో తీరినట్లు ఆయన పేర్కోన్నారు.

5జీ టెక్నాలజీ సొల్యూషన్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్ ను ఐఐటీ మద్రాస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే  5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com