పెట్రో ధరల తగ్గింపు పై ప్రధాని మోదీ ట్వీట్
- May 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రజలే మా మొదటి ప్రాధాన్యత. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు.. ముఖ్యంగా పెట్రో ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రజల జీవితాన్ని సులభతరం (ఈజ్ ఆఫ్ లివింగ్) చేస్తుంది’’ అని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లపై ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







