టైటిల్ విన్నర్ బిందు మాధవి: ఈ సారైనా ‘బిగ్’ సక్సెస్ అందుకుంటుందా.?
- May 23, 2022
‘ఆవకాయ్ బిర్యాని’ సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టింది బిందు మాధవి. కానీ, తెలుగమ్మాయ్ కావడం వల్లనో ఏమో ఆమెకు టాలీవుడ్లో ఆశించిన సక్సెస్ అందలేదు. దాంతో కోలీవుడ్ ఆమెను అక్కున చేర్చుకుంది. అక్కడే స్టార్ హీరోయిన్గా సెటిలైపోయింది.
అయితే, చాలా కాలం తర్వాత బిందు మాధవికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పుణ్యమా అని మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం దొరికింది. బాగా కష్టపడింది. అది పీఆర్ టీముల పుణ్యమే కావచ్చు, హౌస్‌లోని తన ఆట తీరే కావచ్చు.. మొత్తానికి బిగ్‌బాస్ టైటిల్ అయితే దక్కించేసుకుంది. బిగ్‌బాస్ టైటిల్ కొట్టిన తొలి లేడీ కంటెస్టెంట్‌గా ‘బిగ్’ హిస్టరీ క్రియేట్ చేసింది.
అంతా బాగానే వుంది. నెక్స్ట్ ఏంటీ.? బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అయిపోతే చాలదుగా. బిందు మాధవికి చాలా కలలున్నాయ్. కొన్ని కలల ప్రాజెక్టుల్లో హీరోయిన్గా సక్సెస్ అవ్వాలన్న తపన బిందు మాధవిలో మొదట్నుంచీ గట్టిగా నాటుకుపోయింది.
ఆ కల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి భవిష్యత్తులో తీర్చుకోబోతోందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్లో బిందు మాధవికి ఆఫర్లు వస్తున్నాయట. ఆల్రెడీ అనిల్ రావిపూడి తన సినిమాలో ఛాన్సిస్తానని మాటిచ్చేశాడు బిందు మాధవికి.
దాంతో పాటు, ఓ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్గా బిందు మాధవి ఛాన్స్ కొట్టేసిందని తాజా అప్డేట్. ఓ ప్రముఖ బ్యానర్లో రూపొందబోయే ఈ సినిమా ద్వారా బిందు మాధవి సర్ప్రైజింగ్ రెమ్యునరేషన్ కూడా అందుకోబోతందట. ఇదంతా బిగ్‌బాస్ పుణ్యమే అని బిందు మాధవి తెగ మురిసిపోతోందట. చూస్తుంటే, బిందు మాధవి ఈ సారి టాలీవుడ్లో సక్సెస్ అవడం పక్కా అనిపిస్తోంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







