భలే ఛాన్స్ కొట్టేసిన ‘పెళ్లి సందడి’ బ్యూటీ.!
- May 23, 2022
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ మూవీ మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్‌కి ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కూడా లీకులిస్తున్న సంగతీ తెలిసిందే.
అనిల్ రావిపూడి నెక్స్‌ట్ ప్రాజెక్ట్ నందమూరి నటసింహం బాలయ్యతో వుండబోతోంది. బాలయ్య కోసం ఆల్రెడీ మాంచి మాస్ స్టోరీని అనిల్ సిద్ధం చేసేసుకున్నాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాలయ్యని తన సినిమాలో చూపించబోతున్నానంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాడు అనిల్ రావిపూడి.
ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోందట. 50 ఏళ్ల తండ్రి పాత్రలో బాలయ్యని చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి. మరి కూతురి పాత్రలో కనిపించేదెవరు.?
ఆ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో వున్నాడు అనిల్. ‘పెళ్లి సందడి’ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురుగా నటించబోతోందట. ఎమోషన్స్‌తో పాటు, బబ్లీనెస్ కూడా జోడించిన పాత్రట ఇది. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాలయ్య మాస్ ఇమేజ్‌ని పదింతలు పెంచేలా ఈ సినిమా వుండబోతోందని అనిల్ తాజాగా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయ్. వాటన్నింటిలో బాలయ్య ప్రాజెక్ట్ సమ్‌థింగ్ ఢిఫరెంట్ అనే చెప్పాలి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







