రకుల్ బాటలో మహేష్ హీరోయిన్.!

- May 24, 2022 , by Maagulf
రకుల్ బాటలో మహేష్ హీరోయిన్.!

‘వన్ - నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇంతకీ ఏంటా బిజినెస్ అంటారా.? ఫిట్‌నెస్ బిజినెస్. అర్ధమైపోయుంటుంది ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రంగంలో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ సహా కొన్ని మెట్రో సిటీస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ సెంటర్లను ఓపెన్ చేసి తన బిజినెస్‌ని విస్తరించుకుంటూ పోతోంది. అదే బాటలో ఇప్పుడు కృతిసనన్ కూడా నడుస్తోంది. ‘ది ట్రైబ్’ పేరుతో ఓ ఫిట్‌నెస్ సెంటర్ స్టార్ట్ చేసింది కృతిసనన్.

త్వరలోనే ఈ సంస్థను రకుల్‌ లాగానే పలు మెట్రో సిటీస్‌కి విస్తరించాలనుకుంటోందట. అత్యున్నతమైన ఆధునిక, సాంకేతిక పరికరాలు తన ఫిట్‌నెస్ సెంటర్‌లో అందుబాటులో వున్నాయని కృతిసనన్ చెప్పుకొచ్చింది. అత్యుత్తమ ఫిట్‌నెస్ మాస్టర్లు ఈ సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారట.

‘మిమి’ సినిమా కోసం తాను ఏకంగా 15 కేజీల బరువు తగ్గాననీ, ఆ టైమ్‌లోనే ఓ ఫిట్‌నెస్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మదిలో మెదిలిందనీ, కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ఆ ఆలోచనకు బలం చేకూరిందని.. ఈ సంస్థను ఓ బ్రాండ్‌గా విస్తరింపచేయాలన్నదే తన టార్గెట్ అని కృతిసనన్ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు, ప్యాన్ ఇండియా స్టార్  ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రంలో కృతిసనన్ నటిస్తోంది. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com