హీరో, విలన్.. అన్నీ తానే: చరణ్ మామూలోడు కాదుగా.!
- May 24, 2022
విలక్షణ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్న ప్రయోగాత్మక చిత్రం గురించి అందరికీ తెలిసిందే. టైటిల్ కన్ఫామ్ చేయలేదు కానీ, ఒకటీ అరా ఫస్ట్ లుక్ పోస్టర్లతో సినిమాపై ఇప్పటికే చాలా చాలా అంచనాలు పెంచేశారు శంకర్ అండ్ టీమ్.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో చరణ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం. అంటే మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ టైప్‌లో వుండబోతోందా.? అనుకుంటున్నారా.?
కాదు, అందులో ఒకటి విలన్ రోల్ అట. అయితే, ఎన్టీయార్ ‘జై లవకుశ’లా వుండొచ్చేమో.. అని కూడా అనేసుకోవచ్చు. కానీ అక్కడున్నది శంకర్. ఎలాంటి పాత్రల్ని ఎలా ఎలా మౌల్డ్ చేసి మ్యాజిక్ చేస్తాడో ఊహించడమే కష్టం.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ నట విశ్వరూపం అలాంటిలాంటిది కాదు, ప్రతీ సీనులోనూ చరణ్ ఎలివేషన్లు న భూతో న భవిష్యతి అనిపించాయ్. సో, ఆ లెక్కల్లో చరణ్‌కి శంకర్ సినిమాలో మూడు పాత్రలేంటీ.. ముప్పై పాత్రలిచ్చినా అలవోకగా నటించి మెప్పించేయగలడు. ఆ నమ్మకం వుంది.
ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ నాటికల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







