రకుల్ బాటలో మహేష్ హీరోయిన్.!
- May 24, 2022
‘వన్ - నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇంతకీ ఏంటా బిజినెస్ అంటారా.? ఫిట్నెస్ బిజినెస్. అర్ధమైపోయుంటుంది ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ రంగంలో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ సహా కొన్ని మెట్రో సిటీస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్లను ఓపెన్ చేసి తన బిజినెస్‌ని విస్తరించుకుంటూ పోతోంది. అదే బాటలో ఇప్పుడు కృతిసనన్ కూడా నడుస్తోంది. ‘ది ట్రైబ్’ పేరుతో ఓ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేసింది కృతిసనన్.
త్వరలోనే ఈ సంస్థను రకుల్ లాగానే పలు మెట్రో సిటీస్‌కి విస్తరించాలనుకుంటోందట. అత్యున్నతమైన ఆధునిక, సాంకేతిక పరికరాలు తన ఫిట్నెస్ సెంటర్లో అందుబాటులో వున్నాయని కృతిసనన్ చెప్పుకొచ్చింది. అత్యుత్తమ ఫిట్నెస్ మాస్టర్లు ఈ సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
‘మిమి’ సినిమా కోసం తాను ఏకంగా 15 కేజీల బరువు తగ్గాననీ, ఆ టైమ్‌లోనే ఓ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మదిలో మెదిలిందనీ, కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ఆ ఆలోచనకు బలం చేకూరిందని.. ఈ సంస్థను ఓ బ్రాండ్‌గా విస్తరింపచేయాలన్నదే తన టార్గెట్ అని కృతిసనన్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రంలో కృతిసనన్ నటిస్తోంది. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







