‘శేఖర్’ సినిమాతో పాపం నిర్మాత అన్యాయమైపోయాడుగా.!
- May 24, 2022
సీనియర్ హీరో రాజశేఖర్ లీడ్ రోల్ పోషించిన సినిమా ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వీరి తనయ శివానీ కీలక పాత్ర పోషించింది ఈ సినిమాలో. అయితే, విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాని ధియేటర్ నుంచి లేపేశారు.
డిస్టిబ్యూటర్లు డబ్బులు ఎగ్గొట్టారన్న ఆరోపణతో ఈ సినిమాను ధియేటర్ నుంచి లేపేశారు. అంటే విడుదలైన రెండు రోజులకే సినిమా ఆగిపోయిందన్న మాట. నిజంగా రాజశేఖర్‌కి ఇది చాలా అవమానం. మరోవైపు ఈ సినిమాకి నిర్మాణ పరంగానూ తాము భాగస్వాములమని నిన్న మొన్నటి వరకూ జీవిత, రాజశేఖర్ చెప్పుకున్నారు.
కానీ, ఇప్పుడు మాట మార్చేశారు. అసలు సిసలు నిర్మాతను నేనే అంటూ సుధాకర్ రెడ్డి తన గోడు వెల్లబోసుకుంటున్నాడు. పేరుకు మాత్రమే శివానీ, శివాత్మికలు నిర్మాతలు. ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం నాదే.. సినిమాని అర్ధాంతరంగా ఆపేయడంతో తాను ఘోరంగా నష్టపోయాననీ లబో దిబో మంటున్నాడు సుధాకర్ రెడ్డి.
అయితే, ఈ ఇష్యూ వెనక జీవిత రాజశేఖర్ నడిపిస్తున్న కొత్త డ్రామా ఏమైనా వుందా.? అనే అనుమానాలు లేకపోలేవు. ఎందుకంటే, కేవలం ఇది రాజశేఖర్ సినిమా అన్న కారణంగానే కావాలని ఆయన సినిమాకి నష్టం చేయాలన్నవుద్దేశ్యంతోనే రిలీజైన సినిమాని ఆపేశారు.. అనేది జీవిత రాజశేఖర్ ఆరోపణ.
ఆ యాంగిల్‌లో సింపథీ గెయిన్ చేయడానికే సుధాకర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారా.? లేక నిజంగానే నిర్మాతగా సుధాకర్ రెడ్డికి నష్టం జరిగిందా.? అనే కోణంలో కోర్టు వరకూ వెళ్లిన ఈ ఇష్యూపై లోతుగా విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







