అరబ్‌ సమావేశాల ఆవశ్యకతను తెలిపిన ప్రీమియర్‌

- April 07, 2016 , by Maagulf
అరబ్‌ సమావేశాల ఆవశ్యకతను తెలిపిన ప్రీమియర్‌


ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, ఎకానమీతోపాటు పాలిటిక్స్‌ సమర్థవంతంగా ఉండాలనీ, అది గ్లోబల్‌ డెసిషన్‌ మేకింగ్‌ ప్రోసెస్‌ని ప్రభావితం చేయగలవని అన్నారు. అరబ్‌ ఫైనాన్స్‌ మినిస్టర్స్‌ మరియు గవర్నర్స్‌ (అరబ్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌)ను ప్రీమియర్‌ గుడైబియా ప్యాలెస్‌లో రిసీవ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రీమియర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు అరబ్‌ ప్రపంచంపై ఫోకస్‌ పెట్టాయనీ, ఇబ్బందికర పరిస్థితులను గమనిస్తున్నాయనీ, అరబ్‌ సమాజ భద్రత, మరియు ఎకానమీపై వాటి ప్రభావంపై కొంత ఆందోళన ఉందని, అరబ్‌ డెసిషన్‌ మేకర్స్‌, ఆ విభాగాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాలని కోరారు. అరబ్‌ సీనియర్‌ అధికారుల మధ్య సమావేశాలు నిరంతరం జరుగుతూ సమస్యలపై చర్చించుకోవాలని ఈ సందర్భంగా ప్రైమ్‌ మినిస్టర్‌ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల పతనంపై అధ్యయనం చేసి, తగు చర్యలు తీసుకోవాలని అరబ్‌ సమాజానికి ప్రీమియర్‌ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com