గల్ఫుగాది

- April 07, 2016 , by Maagulf

ఎడారిలో కోయిల

తెలుగు పాట

పాడుతోంది.

 

ఖర్జూరానికి

మరో ఆరు రుచులు 

తోడొచ్చాయి.

 

దినార్లు, దిర్హాంలు,

రియళ్ళు-

వేపపువ్వు కోసం 

వెతుక్కుంటున్నాయి. 

 

అరబ్బీ మురబ్బాలు

ఉగాది పచ్చడి రుచికి

వారెవా

అంటున్నాయి. 

 

అలిఫ్, బె, పె, టేలు

తెలుగుకి "నమస్కారం" చెప్పాయి;

అ, ఆ, ఇ, ఈలు

అరబ్బీతో "మర్హాబా" అన్నాయి

 

"నీ గజల్, రుబాయిలు నా కవిత్వంలో ఉన్నాయి"

అంది అరబ్బీతో తెలుగు;

"నీ పిల్లలెందరో నా గుండెల్లో ఉన్నారు"

అంది తెలుగుతో అరబ్బీ. 

"నీ పెట్రోల్ బావులు ఖరీదైనవి"

అంది అరబ్బీతో తెలుగు

"కష్టజీవులైన నీ పిల్లల మనసుల కన్నానా?"

అంది తెలుగుతో అరబ్బీ. 

 

ఖురాన్ సురాలు నినదించే గాలికి

వేదభూమి పంపిన వసంత కానుక-

ఆరు రుచులుతో

రెండు సంస్కృతులు

సంగమం-

గల్ఫ్ లో ఉగాది. 

 

-సిరాశ్రీ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com