2024 నాటికి అబుధాబి BAPS హిందూ మందిర్ రెడీ....
- May 28, 2022
అబుధాబి:యూఏఈ లో నిర్మిస్తున్న మొదటి హిందూ దేవాలయాన్ని 2024, ఫిబ్రవరిలో తెరవబడుతుందని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు.కోవిడ్ కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగినా సకాలంలోనే మందిర నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దుబాయ్-అబుధాబి హైవే పక్కన ఉన్న Abu Mureikah లో ఉన్న ఈ మందిరంలో జరుగుతున్న 'మహాపీఠ్ పూజా కత్రువు' కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ,యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మాద్ బిన్ జయేద్ నహ్యన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న మైత్రీ కారణంగా నిర్మాణం గావించబడుతున్న ఈ మందిర నిర్మాణం రెండు భిన్న మతాల మధ్య ఉన్న సామరస్య వాతావరణానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.బ్రహ్మవిహారి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.
బ్రహ్మవిహారి స్వామి మాట్లాడుతూ ," ఈరోజు అత్యంత చారిత్రాత్మకమైన రోజు. యోగిజీ మహరాజ్ 130వ జయంతి సందర్భంగా ఆలయంలో ఈ కత్రువు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
10 మంది పూజారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మందిర నిర్మాణంలో భాగమైన 3,000 మంది కార్మికులు పాల్గొన్నారు.మందిరాన్ని నిర్మిస్తున్న భూమిని షేక్ మహ్మాద్ విరాళంగా ఇవ్వగా 2019, ఏప్రిల్ లో శంకుస్థాపన జరిగగా, ఆ సంవత్సరం డిసెంబర్ లో నిర్మాణం మొదలైంది.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్న ఈ మందిరంలో అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునే విధంగా సుమారు 1000 సంవత్సరాల చెక్కు చెదరకుండా ఉండేలా ఈ మందిర నిర్మాణం లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు.



తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







