'అంటే.. సుందరానికీ' థియేట్రికల్ ట్రైలర్ జూన్ 2న విడుదల
- May 30, 2022
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ రోజు చిత్రం నుండి గ్లింప్స్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు.ఈ వీడియోలో ప్రతి నటీనటులు అయోమయంగా గంధరగోళంగా కనిపిస్తూ..చివరకు నాని, నజ్రియా 'అంటే సుందరానికి' థియేట్రికల్ ట్రైలర్ జూన్ 2న విడుదలవుతుందని వెల్లడించారు.ఈ ట్రైలర్ మరింత వినోదాత్మకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







