అబుధాబి: రేపటి నుంచి ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌పై నిషేధం

- May 31, 2022 , by Maagulf
అబుధాబి: రేపటి నుంచి ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌పై నిషేధం

యూఏఈ: ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ అబుధాబి (ఇఎడి), ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది.రేపటి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.అయితే, కొన్ని బ్యాగులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు వుంది.ఫార్మసీలలో మందులు తీసుకెళ్ళందుకు వినియోగించేవి, కూరగాయలు, మీట్, ఫిష్, చికెన్, గ్రెయిన్స్ మరియు బ్రెడ్ కోసం వినియోగించేవి, పెద్ద షాపింగ్ బ్యాగ్స్ (ఫ్యాషన్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం) వేస్ట్ ప్యాకెట్లు, పోస్టల్ పార్సిళ్ళ కోసం (మ్యాగజైన్లు, పత్రికల కోసం) వాడేవి, లాండ్రీ బ్యాగులు, మొక్కలు, పువ్వుల్ని రవాణా చేసేవి.. ఈ నిషేదం నుంచి మినహాయింపు పొందాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com