కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..
- May 31, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 1వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.భారత రాయబారి సిబి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు. ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం, జ్లీబ్ అల్ షుయూక్ (అబ్బాసియా)లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే.అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఎంబసీ వెల్లడించింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్‌లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం.,కాంటాక్ట్ నం,కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







