పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 6 నెలలపాటు జరిమానా మినహాయింపు

- June 02, 2022 , by Maagulf
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 6 నెలలపాటు జరిమానా మినహాయింపు

సౌదీ: సకాలంలో పన్ను చెల్లింపులు చేయని వారికి విధించే జరిమానాలను 6 నెలలపాటు మినహాయింపు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. జూన్ 1, 2022 నుండి ఆరు నెలల పాటు జరిమానాలను మాఫీ చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు జరిమానాల నుండి మినహాయింపును పునఃప్రారంభిస్తున్నట్లు సౌదీ జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) ప్రకటించింది. COVID-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న అర్థిక పరిస్థితిని చక్కదిద్దడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో జాప్యం, డిఫాల్ట్ చెల్లింపు, నివేదిక సమర్పణలో ఆలస్యం వంటివి జరిమానాల మినహాయింపులో చేర్చినట్లు కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com