అసోసియేషన్ సమావేశాలకు నంబర్ వన్ గమ్యస్థానం దుబాయ్
- June 02, 2022
దుబాయ్: అసోసియేషన్ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ గమ్యస్థానంగా దుబాయ్ పేరుపొందింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అండ్ కన్వెన్షన్ అసోసియేషన్ (ICCA) నివేదిక 2021 స్పష్టం చేసింది. అంతర్జాతీయ సంఘాలు నిర్వహించే సమావేశాల సంఖ్యకు సంబంధించి 2021లో దుబాయ్‌ని అగ్ర నగరంగా ICCA నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని ప్రముఖ సమావేశాల పరిశ్రమ ఎగ్జిబిషన్ అయిన IMEX ఫ్రాంక్ఫర్ట్ 2022 ఎడిషన్‌లో వ్యాపార కార్యక్రమాలను హోస్ట్ చేయడంలో దుబాయ్ తన విశిష్టతను నిలుపుకుందని తెలిపింది. COVID-19 మహమ్మారి తర్వాత వ్యక్తిగతంగా వ్యాపార కార్యక్రమాలను పునఃప్రారంభించిన మొదటి గమ్యస్థానాలలో దుబాయ్ ఒకటని, అక్టోబర్ 2020 నాటికి అంతర్జాతీయ సమావేశాలు, హాజరైన వారికి దుబాయ్ మెరుగైన ఆతిథ్యం ఇచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







