‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ అవుతుందా.?
- June 02, 2022
‘రంగస్థలం’ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తొలిసారి జత కట్టింది ముద్దుగుమ్మ సమంత. ఈ సినిమాలో ఆమె పోషించిన రామలక్ష్మి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాణం పెట్టేసింది నిజంగానే సమంత ఆ పాత్రకు. తర్వాత మళ్లీ చిట్టిబాబు, రామలక్ష్మి కాంబినేషన్ అస్సలు సోదిలోకే రాలేదు.
చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే సమంత పేరు వినిపిస్తోందట. అదేంటీ.? ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ వుంది కదా.. కైరా అద్వానీ.. అనుకుంటున్నారా.?
ఆగండాగండి. సమంతను హీరోయిన్గా కాదు. స్పెషల్ రోల్ కోసం అనుకుంటున్నారట. ఏడెనిమిది నిముషాల నిడివితో వుండే పాత్రట అది. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రని అంటున్నారు. మొదట్లో ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ కానీ, నయనతార కానీ అనుకున్నారట.
కానీ, కొత్తగా సమంత పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ బ్లాక్‌తో కూడిన పాత్ర అనీ తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’లో సమంత యాక్షన్ టాలెంట్ చూశాకా, ఈ ఎపిసోడ్‌కి సమంత అయితే బాగుంటుందని డైరెక్టర్ భావిస్తున్నాడట. త్వరలోనే క్లారిటీ రానుంది.
మరోవైపు సమంత చేతిలో ‘శాకుంతలం’, ‘యశోద’ అను డిఫరెంట్ కాన్సెప్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వున్నాయి. వీటితో పాటు, హిందీ, తమిళంలోనూ కూడా కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్ సమంతకు. ఈ నేపథ్యంలో శంకర్ సినిమా ఛాన్స్ తీసుకుంటుందా.? శంకర్ సినిమాలో నటిస్తే ఆ కిక్కు వేరే లెవల్. సో సమంత వదులుకునే అవకాశమే లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ.
తాజా వార్తలు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!







