మేజర్ జాక్ పాట్ కొట్టడం ఖాయమే.!

- June 02, 2022 , by Maagulf
మేజర్ జాక్ పాట్ కొట్టడం ఖాయమే.!

యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. ఆర్ధిక రాజధాని ముంబయ్ టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ఎటాక్‌లో వీరోచితంగా పోరాడి, ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ శుక్రవారం ‘మేజర్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు సినిమాపై. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ మోస్తరుగానే జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్‌లో భాగంగా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయట. కానీ, డీల్స్ చాలా జాగ్రత్తగా జరిగాయట.

సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నిర్మాతలకు లాభాల పంట పండడం ఖాయమని అంటున్నారు. అందుకూ కారణం లేకపోలేదు. ఈ మధ్య దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ధియేటర్లలో వసూళ్ల పంట పండడంతో పాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.

ఆ లెక్కల్లో ‘మేజర్’ కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ‘మేజర్’ మంచి పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు. అడవి శేష్ మంచి నటుడు. అన్నింటికీ మించి ఈ మధ్య ‘సర్కారు వారి పాట’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా వెనక వుండడం మరో మెయిన్ అస్పెట్ కానుంది ‘మేజర్’కి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com