బాలుకి ప్రేమతో– సినీ మ్యూజిషియన్స్ యూనియన్
- June 02, 2022
హైదరాబాద్: తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. జూన్ 4వతేది బాలుగారి జయంతి (పుట్టినరోజు). ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్రభార తిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘ బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకని ఉదయం 10గంటలనుండి రాత్రి 10 గంటలవరకు 12గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్ చేస్తున్నాం. పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నాము’’ అన్నారు. సినీ మ్యూజిషియన్స్యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ–‘‘ 30ఏళ్ల చరిత్ర ఉన్న మా సినిమా మ్యూజిక్ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్ అవుదామనుకునేవారికి మ్యూజిషియన్స్‌కి మా యూనియన్ తొలిమెట్టు. మా వద్ద సభ్యులై ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థతరపునుండి పూర్తి సహాయ,సహకారాలను అందచేస్తాము అని చెప్తున్నాము. పాన్డమిక్లో వయసుపైబడిన కళాకారులతో పాటు, ఆపదలో ఉన్న ఎంతోమందికి మా యూనియన్ ద్వారా ఆర్ధికంగా చేయూతనిస్తున్నాం. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు బాలుగారు. దురద్రుష్టవశాత్తు ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్ ప్రతినిధులుగా నేను, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని మీడియా ముఖంగా తెలియపరచటమైనది’’ అన్నారు. సి.యం.యు ట్రెజరర్ రమణ శీలం మాట్లాడుతూ–‘‘ తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అని అనుకుంటున్నాం. కాబట్టి వారి జన్మదినాన్ని పెద్ద పండుగలా చేస్తున్నాం. ఇంత పెద్ద పండుగను చేసుకోవటానికి మాకు అవకాశం కల్పించిన సీయం కె.సి.ఆర్ గారికి, తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం’’ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు మాట్లాడుతూ– ‘‘బాలుగారి టీమ్‌లో మ్యూజిషియన్‌గా దాదాపు 25ఏళ్లపాటు పనిచేశాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమంలో పాల్గొని మీరు ఆనందించి మమ్మల్ని మా యూనియన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ–‘‘ బాలుగారంటే మా జనరేషన్ సింగర్స్ అందరకీ ఇన్స్పిరేషన్. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది. జూన్ 4న ఆయనని మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇకనుండి నా వంతుగా మా యూనియన్‌కి ఎప్పుడూ నా సహాయసహకారాలు అందిస్తాను’’ అన్నారు. సింగర్ కౌసల్య మాట్లాడుతూ–‘‘ వందమందికి పైగా సింగర్స్ పాల్గొని దాదాపు 12గంటలపాటు బాలుగారికి స్వర నీరాజనాన్ని అందించబోతున్నాం. మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







